Site icon NTV Telugu

సమంత పేరు నుండి అక్కినేని ఆవిరైంది!

Samantha removes Akkineni Surname at her social media Accounts

సమంత రుత్ ప్రభు… అనగానే తెలుగువాళ్ళు కనుబొమ్మలు కాస్తంత ముడి వేస్తారు కానీ తమిళనాడులో హీరోయిన్ సమంత పూర్తి పేరుతోనే పాపులర్. అక్కినేని నాగచైతన్యను పెళ్ళి చేసుకోకముందే సమంత తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గానూ రాణించింది. అయితే తొలి తెలుగు సినిమా ‘ఏమాయ చేశావే’ సందర్భంగా ఏర్పడిన పరిచయం… ప్రణయంగా మారి ఆ తర్వాత చైతు, సమ్ము పరిణయానికి దారితీసింది. అప్పటి నుండీ సమంత సోషల్ మీడియాలో తన పేరు పక్కన సమంత అక్కినేని అని డిస్ ప్లేలో మార్చింది.

Read Also : చదువుల తల్లికి అండగా ‘మనం సైతం’

కానీ హఠాత్తుగా ఇప్పుడు తన పేరు స్థానంలో కేవలం ‘ఎస్’ అక్షరాన్ని మాత్రమే డిస్ ప్లే చేస్తోంది. దాని క్రింద కూడా సమంత అక్కినేని అని కాకుండా సమంత రుత్ ప్రభు అని పెట్టడం నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. సమంత ఇలా పేరును షార్ట్ కట్ చేయడం, మరీ ముఖ్యంగా అక్కినేని అనే భర్త ఇంటి పేరును తొలగించడం వెనుక ఏ స్ట్రేటజీ ఉందా? అని ఆలోచించడం మొదలెట్టారు. చిత్రం ఏమంటే… సినిమా వాళ్ళు ఒక్కోసారి ఏదోరకంగా ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. సమంత కూడా అలా తన పేరు డిస్ ప్లే ను మార్చిందని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా… సమంత ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Exit mobile version