Site icon NTV Telugu

Samantha : సమంత-రాజ్ జిమ్ అవుటింగ్.. రిలేషన్ పై ఇంకా సైలెన్స్

Samantha

Samantha

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుందనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో సంబంధంలో ఉన్నారనే ప్రచారం మరింత వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత వరకు ఇద్దరూ ఆ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, తరచుగా కలిసే కనిపించడంతో అభిమానులో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Also Read : OG : ఓజీ’లో తన పాత్రపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్రియా రెడ్డి!

వెకేషన్స్‌కి వెళ్ళడం, పబ్లిక్ లొకేషన్స్‌లో ఫోటోలు దిగటం, డిన్నర్స్, ఆలయ పర్యటనలు, చేయి పట్టుకుని ఫోటోలు తీయడం వంటి చిన్న చిన్న ఘటనలు. ఇవన్నీ నెటిజన్లలో, అభిమానులలో సమంత-రాజ్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ముంబై బాంద్రా లోని ఓ జిమ్ నుంచి సమంత, రాజ్ కలిసి బయటకు వచ్చారు. ఇద్దరూ లైట్ పింక్ డ్రెస్ ధరించి కాస్తా ఫిట్‌నెస్ రూటీన్ పూర్తిచేసినట్లు కనిపించారు. జిమ్ నుంచి బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లిపోయిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మరో సారి సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే రాజ్ ఇప్పటి వరకు శ్యామాలితో వివాహితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. కొద్ది రోజులుగా “రాజ్-శ్యామాలి విడిపోతున్నారనే” వార్తలు వస్తున్నప్పటికీ, ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు, శ్యామాలి సోషల్ మీడియాలో నమ్మకం, విశ్వాసం వంటి అంశాలపై సందేశాత్మక పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది . మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version