Site icon NTV Telugu

Samantha : ముందు కంటే ఇప్పుడే బాగున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..

Samantha

Samantha

టాలీవుడ్‌లో అందమైన జంట అంటే సమంత, నాగచైతన్య అనే చెప్పాలి. కానీ ఎవ్వరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఊహించని విధంగా ఇద్దరు కొద్ది రోజులకే విడిపోయారు. వీరు అసలు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ ట్వీస్ట్ . ఇక చై సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటికి సమంత మాత్రం సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ తిరిగి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ భామ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Also Read : Dhanush : పవన్ కల్యాణ్‌నే డైరెక్ట్ చేస్తా .. ధనుష్

‘కీర్తి ప్రతిష్టలకు అతీతంగా.. స్వేచ్ఛగా జీవితాన్ని గడపడమే నిజమైన విజయం. గత రెండేళ్లుగా నేను నటించిన సినిమాలు రాలేదు, ఈ గ్యాప్ లో నేను చాలా సాధించాను. జీవితం తాలూకు ఒక వృత్తానికి పరిమితం కాకుండా స్వేచ్ఛగా వృద్ధిలోకి రావడం, పరిణితి సాధించడం అన్నింటికంటే ముఖ్యం. నాకు రెండేళ్ళుగా విజయాలు లేవని చాలా మంది భావిస్తున్నారు కావొచ్చు. కానీ గతంలో కంటే ఇప్పుడు నేను బాగున్నా. ప్రతి రోజు ఉత్సాహంగా నిద్రలేస్తున్నా. జీవితాశయం దిశగా స్పష్టంగా ఆలోచిస్తున్నా. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడే నేను ఉన్నతమైన విజయాలు ఆస్వాదిస్తున్నా’ అని సమంత చెప్పింది. ప్రస్తుతం స్వీయనిర్మాణం‌లో సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తుండగా, హిందీలో ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ సిరీస్‌తో ముందుకురానుంది.

Exit mobile version