సౌత్ బ్యూటీ సమంతా అక్కినేని తన అభిమానులను సూపర్ క్యూట్ ఫోటోతో ట్రీట్ చేసింది. ఆమె తల్లి తీసిన ఈ ఫొటోలో సామ్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతోంది. ఆ మెరుపుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. సామ్ తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. దానికోసం ఆమె యోగా నుండి హెవీ వెయిట్ లిఫ్టింగ్ వరకు దేన్నీ వదలదు. ఇక సామ్ కు మంచి ఫ్యాషన్ అభిరుచి కూడా ఉంది. ఆమెకు సంబంధించి ఓ పిక్ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది.
Read Also : “హిట్” హిందీ రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్
కాగా ఇటీవలే సమంత “ఫ్యామిలీ మ్యాన్-2” వెబ్ సిరీస్ తో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రాజీ పాత్రలో కన్పించిన సామ్ నటనకు ప్రశంసల వర్షం కురిసింది. ప్రస్తుతం సామ్ కిట్టీలో రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” కాగా, రెండవది తమిళ చిత్రం “కాతు వాకుల రెండు కాదల్”. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.