“హిట్” హిందీ రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్

తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారు. రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతోంది. ఇంతకుముందు ‘పాగ్‌లైట్‌’ అనే నెట్‌ఫ్లిక్స్ సీరీస్ లో కన్పించిన ఈ భామ “హిట్” సినిమా చూశానని, ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించడం సంతోషంగా ఉందని వెల్లడించింది.

Read Also : యూఎస్ నుంచి తిరిగొచ్చేసిన తలైవా

కాగా తెలుగు చిత్రం “హిట్”లో విశ్వక్ సేన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ వెర్షన్‌ను టి-సిరీస్ భూషణ్ కుమార్, దిల్ రాజు, క్రిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ నిర్మిస్తున్నారు. హిందీ రీమేక్‌లో రాజ్‌ కుమార్ రావు పోలీసు పాత్రలో కనిపించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-