సమంత ముంబైకి మకాం మార్చబోతోందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకూ స్ట్రయిట్ హిందీ చిత్రంలో నటించలేదు. గత కొన్నేళ్ళుగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరించింది. కానీ హిందీ వెబ్ సీరిస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె నటించడం, దానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో ‘సమంత మనసు మార్చుకుంటోందా?’ అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ నటుడు, నటి అయినా… ఉన్నచోటనే ఆగిపోవాలని అనుకోరు. అవకాశం దొరకాలే కానీ తమ ప్రతిభను మరింత ఎక్కువ మంది ముందు ప్రదర్శించాలని, మరింత విస్తారంగా పేరు ప్రఖ్యాతులు గడించాలని కోరుకుంటారు. దీనికి తోడు సమంత కేవలం నటనకు పరిమితం కాకుండా గత కొంతకాలంగా సామాజిక కార్యక్రమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోకి విస్తరిస్తోంది. ఆ దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి మకాం మార్చితే తప్పేమిటనే ఆలోచన సమంత చేస్తుందని తెలుస్తోంది.
Read Also : నిర్మాతలను ఎగ్జిబిటర్స్ నియంత్రించగలరా!?
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
పూర్తి స్థాయిలో ముంబైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేయకపోయినా… కనీసం యేడాదిలో కొన్ని నెలలు అక్కడే గడపాలని సమంత అనుకుంటోందట. అందులో భాగంగా ముంబైలోని ప్రైమ్ లొకేషన్ లో ఓ ఇంటిని ఆమె కొనుగోలు చేయబోతోందని అంటున్నారు. ముంబైలోని పరిచయస్థుల ఆసరాతో ఇంటికై వేట మొదలెట్టిందట. ఇదిలా ఉంటే… ఇప్పటికే నాగ చైతన్య హిందీ చిత్రసీమ వైపు దృష్టి పెట్టాడు. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సహజంగానే చైతుకు మరిన్ని బాలీవుడ్ ఆఫర్స్ వస్తాయని సమంత భావిస్తోందట. అలానే ఆమె కూడా తన కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ మూవీ ఒకేసారి విడుదల కాబోతోంది. అలానే మరో పక్క ఇంకో వెబ్ సీరిస్ చేయడానికి సమంత అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి చూస్తే… సమంత ముంబైకి మకాం మార్చడంలో అర్థం ఉందనిపిస్తోంది. ఇప్పటికే సౌతిండియాకు చెందిన కొందరు హీరోయిన్లు, రామ్ చరణ్ వంటి హీరోలు ముంబైలో తమకంటూ సొంత ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో… సమంత కూడా వాళ్ళనే అనుసరిస్తోందని అనుకోవచ్చు.
తాజావార్తలు
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!