NTV Telugu Site icon

Samantha: కొండాసురేఖ ఆరోపణలు.. అమ్మవారి సేవలో సమంత

Samantha Lingabhairavi

Samantha Lingabhairavi

సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య సమస్య కారణంగా కొంతకాలం సినిమాలకు మరియు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో యోగా, ధ్యానంతో పాటు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సమంత విడాకుల వార్తల్లో నిలిచింది. తెలుగు స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల విడాకుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టించగా, దానికి సమంత బదులివ్వగా, ఆ తర్వాత సురేఖ క్షమాపణలు చెప్పింది. ఆడవాళ్ళని ఎక్కువగా వస్తువులుగా చూసే గ్లామర్ ఇండస్ట్రీలో బతకడానికి, ప్రేమలో పడటానికి, ప్రేమలో కింద పడటానికి, మళ్ళీ నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. విడాకులు నా వ్యక్తిగత సమస్య. మీరు దాని గురించి మాట్లాడకూడదు. మా కంటెంట్‌ను ప్రైవేట్‌గా ఉంచడమే మా ఉద్దేశం. దీనిపై మీరు మాట్లాడాల్సిన అవసరం లేదని సమంత ఘాటుగా బదులిచ్చారు.

Thalapathy 69: గ్రాండ్ గా మొదలైన దళపతి విజయ్ చివరి సినిమా

ఇదంతా వార్తల్లో ఉండగానే సమంత మళ్లీ ఇషా ఫౌండేషన్‌ను ఆశ్రయించింది. ఇషా ఫౌండేషన్‌కి వెళ్లిన సమంత అక్కడ లింగభైరవి దేవిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా నటి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. లింగభైరవి వడ మోకరిల్లిన ఫోటోను సమంత షేర్ చేసింది. ధన్యవాదాలు దేవీ! అని కామెంట్ చేసిన ఆమె అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సినిమాల విషయానికి వస్తే ఈ భామ చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటించింది. సమంత ప్రస్తుతం సిటాడెల్, రక్త్ బ్రహ్మాండం అనే రెండు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. సమంత మరిన్ని సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Show comments