బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఓ బాలీవుడ్ సినిమా ఒకే రోజున ఇలా థియేటర్లలోనూ, ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. ఇక ఈ చిత్రం నుంచి సోమవారం విడుదలైన ‘సీటిమార్’ సాంగ్ యూట్యూబ్‌లో 24 గంటల్లో 30 మిలియన్ల వ్యూస్ దాటేసి రికార్డులను బద్దలుకొట్టింది. దీంతో ఈ సినిమా గురించి సల్మాన్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ముందుగా తెలుగులో హిట్ అయిన ‘సీటిమార్ ‘ సాంగ్ ను ఇప్పుడు హిందీలో రీమేక్ చేశారు.
సల్మాన్ ‘సీటిమార్’కు భారీ వ్యూస్…!
