బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాథే’. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ సినిమా ఒకే రోజున ఇలా థియేటర్లలోనూ, ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో దిశాపటాని నాయిక. సల్మాన్ నిరంకుశుడైన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇతర పాత్రలను జాకీ ష్రాఫ్, రణదీప్ హూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. థియేటర్లను, ఓటీటీని ఒకే సారి టార్గెట్ చేస్తున్న ‘రాధే’ సినిమాపై బాలీవుడ్ వర్గాలు దృష్టి సారించాయి. ఈ సినిమా విజయవంతం అయితే మాత్రం మరిన్ని సినిమాలు ఇదే బాట పట్టే ఛాన్స్ ఉంది.
‘రాథే’ రేటు ఫిక్స్ అయ్యింది!
