సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న’రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. కరోనా కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు మల్టీ ఫార్మాట్ రిలీజ్ కు ప్లానింగ్ చేశారు. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. అంటే అన్ని పిల్లలు సైతం పేరెంటల్ గైడెన్స్ తో ఈ మూవీని చూడొచ్చు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశాపటాని, రణదీప్ హూడా, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘రాధే’ ట్రైలర్, అందులోని సీటీమార్, దిల్ దే దియా పాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సల్మాన్ ‘రాధే’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!
