Site icon NTV Telugu

ముందు ఇంటర్నెట్ లో… తరువాత ఈడియట్ బాక్స్ లో… బిగ్ బాస్ 14 షురూ!

Salman Khan unveils the first promo of Bigg Boss new season

బిగ్ బాస్ మళ్లీ మొదలవ్వబోతోంది! సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 14 హడావిడి అప్పుడే మొదలైపోయింది. తాజాగా ఓ ప్రోమో కూడా వదిలారు షో నిర్వాహకులు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్ అప్రోచ్ ఉండనుంది. టీవీలో కంటే ముందుగా ఓటీటీలో అలరించబోతోంది వివాదాస్పద రియాల్టీ షో. కలర్స్ ఛానల్ లో ప్రసారం అవ్వటానికి ఆరు వారాల ముందు నుంచే వూట్ ఓటీటీలో బిగ్ బాస్ 14 సందడి మొదలైపోతుంది!

Read Also : అభిమానుల బుద్ధి మారాలంటున్న సిద్ధార్థ్

బిగ్ బాస్ 14 ఆన్ లైన్ లో అలరించటంతో ప్రేక్షకులకి మరింత థ్రిల్ పెరుగుతుందని మేకర్స్ అంటున్నారు. ఓట్లు వేయటం, తమ అభిప్రాయాలు చెప్పటం ఇంటర్నెట్ లో మరింత ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ తమకు నచ్చిన టాస్కులు కూడా ఇవ్వవచ్చట!
బిగ్ బాస్ 14 ఓటీటీ సందడి ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తుండగా టెలివిజన్ లోనూ కొన్ని మార్పులు రాబోతున్నాయి. క్రేజీ రియాల్టీ షో కారణంగా రెండు సీరియల్స్ శుభం కార్డ్ వేసేసుకుని పక్కకు తప్పుకుంటాయట. ఈ మధ్యే మొదలైన డైలీ సోప్ ‘ఉడారియా’ నిలిపేసే ఆలోచనలో ఉందట కలర్స్ యాజమాన్యం. అంతే కాదు, ‘శక్తి’ సీరియల్ కూడా గుడ్ బై చేప్పేయనుంది. ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే… బిగ్ బాస్ 14 కోసం పక్కకు తప్పకుంటోన్న ‘శక్తి’ సీరియల్ లో ప్రధాన పాత్ర బిగ్ బాస్ 13 విన్నర్ రుబీనా దిలాయక్ చేస్తుండటమే! చూడాలి మరి, సల్మాన్ బుల్లితెర వినోదం ఈసారి ఓటీటీకి కూడా విస్తరిస్తోంది. ఓటీటీలో హద్దులుండవు కాబట్టి ముద్దులు, మురిపాలు ఇంకెంత పెరుగుతాయో…

Exit mobile version