సల్మాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు అతడితో వర్క్ చేసిన డైరెక్టర్స్ మురుగుదాస్ అండ్ అభినవ్ కశ్యప్. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మాన్ ఖానే కారణమంటూ సౌత్ డైరెక్టర్ మురుగుదాస్ కామెంట్స్ చేశాడు. ‘రాత్రి 8 గంటలకు షూట్‌కు వస్తాడు. షూటింగ్ స్టార్టయ్యే టైంకి 11 అవుతుంది. అర్థరాత్రి 2-3 గంటల వరకు షూట్ చేయాల్సి వచ్చేది. దీని వల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్ సరిగ్గా పండలేదు” అంటూ తప్పంతా సల్లూబాయ్‌దే అన్నట్లుగా మురుగుదాస్ సల్మాన్ పై నేరం మోపాడు. దీనిపై బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేగింది.
Also Read : BunnyVas : పోటీ అనేది ఎప్పుడూ ధర్మంగా ఉండాలి. నేను ధర్మం వైపు ఉంటాను.
మురుగుదాస్ సంగతి ఇలా ఉంటే దబాంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ కూడా సంచలన కామెంట్స్ చేశాడు. ‘సల్మాన్ ఖాన్ ఓ గుండా. అతడికి నటన పట్ల ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదాను మాత్రమే ఆస్వాదిస్తాడు. షూటింగ్‌కు రావడం ఓ గొప్ప ఘనకార్యంగా ఫీలవుతాడు. దబంగ్ సీక్వెల్ చేయనన్నందుకు ఆ కుటుంబం నాపై పగ ప్రతీకారాలకు పాల్పడింది. వాళ్ల కుటుంబం వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది” అంటూ సల్మాన్ పై నిప్పులు చెరిగాడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్. ఇలా తనపై వరుసగా రిమార్క్ పడటంతో మౌనంగా ఊరుకుంటే ఇక రాళ్లు వేస్తారనుకున్నాడేమో బిగ్ బాస్ 19లో ఇద్దరు దర్శకులకు కౌంటర్లేసేశాడు సల్లూభాయ్. మురుగుదాస్‌ను ఉద్దేశించి..’ సికిందర్ ఫ్లాట్ చాలా బాగుంది. కానీ నేను రాత్రి 9 గంటలకు సెట్స్‌కి వెళ్లడం వల్ల సినిమా ప్లాప్ అయ్యిందని డైరెక్టర్ అంటున్నాడు. గాయాల వల్ల నేను ఆలస్యంగా వెళ్లేవాడిని. అది దర్శకుడికి తెలియదు. మరి ఆయన తీసిన మదరాసి హీరో 6 గంటలకే షూట్‌కు వెళ్లిపోయే వాడు. సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ” అంటూ సెటైర్ వేశాడు సల్లూభాయ్. ఇక అభినవ్ కశ్యప్ గురించి డైరెక్టుగా ప్రస్తావించకుండా.. దబాంగ్ డైరెక్టర్ నాతో పాటు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్‌ను ప్రతి విషయంలో లాగుతుంటాడు. మా మీద విమర్శలు చేసే బదులు వర్క్‌పై కాన్సట్రేషన్ చేయండి. మీ కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోండి అంటూ కౌంటరిచ్చాడు సల్మాన్ ఖాన్. మొత్తానికి తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో.
