Site icon NTV Telugu

‘రాధే’ రివ్యూ రైటర్ పై సల్మాన్ పరువు నష్టం దావా…?

Salman Khan filed defamation suit against KRK

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం మే 13న ఈద్ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం భాయ్ అభిమానులను సైతం నిరాశ పరిచింది. అయితే ‘రాధే’ రివ్యూ రైటర్ పై సల్మాన్ పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ లీగల్ బృందం కమల్ ఖాన్‌కు ఫిర్యాదుకు సంబంధించి లీగల్ నోటీసును సోమవారం పంపింది. కమల్ ఖాన్ ఈ విషయాన్ని తెలుపుతూ “సల్మాన్ ఖాన్ ‘రాధే’ రివ్యూ చేసినందుకు కోసం నాపై పరువు నష్టం కేసు పెట్టాడు!” అంటూ ట్వీట్ చేశాడు. “నేను చాలా సార్లు చెప్పాను, ఏ నిర్మాతైనా లేదా నటుడైన తన సినిమాకు రివ్యూ ఇవ్వొద్దని అడిగితే… నేను ఇవ్వను. సల్మాన్ ఖాన్ ‘రాధే’ రివ్యూ ఇచ్చినందుకు నాపై పరువు నష్టం కేసు పెట్టారు అంటే నా రివ్యూ వల్ల అతను ఎక్కువగా ప్రభావితమవుతున్నాడు. అందువల్ల నేను అతని సినిమాలకు రివ్యూ ఇవ్వను. ఈ రోజు నా చివరి వీడియో విడుదల అవుతుంది” అని ట్వీట్ చేశారు కమాల్ ఖాన్. నోటీసు ప్రకారం సల్మాన్ ఖాన్ న్యాయ బృందం గురువారం నగర సివిల్ కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి ముందు అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రస్తావించనుంది.

Exit mobile version