NTV Telugu Site icon

Salaman Khan Firing case : సల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ కేసులో ట్విస్ట్.. నిందితుడి ఆత్మహత్యాయత్నం..

Whatsapp Image 2024 05 01 At 3.20.04 Pm

Whatsapp Image 2024 05 01 At 3.20.04 Pm

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట జరిగిన కాల్పులు జరిగిన ఘటన గురించి తెలిసిందే
ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత భారీగా పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32) అనే నిందితులను సోమవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో నిందితులపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను విధించారు.

 

అరెస్టయిన ముగ్గురు నిందితుల కస్టడీని మరోసారి మే 8 వరకు పొడిగించడం జరిగింది… అదే సమయంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద ముంబై పోలీసులు ఈ యాక్ట్ ను విధించారు.ఈ నిందితుల్లో ఒకరయిన అనుజ్ థాపన్‌ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులకు ఆయుధాలు అందించినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి.ఇదిలా ఉంటే అనూజ్‌ థాపన్ పోలీసు కస్టడీలో ఆత్మహత్యప్రయత్నం చేసాడు . దీనితో అతని పరిస్థితి విషమంగా మారడంతో ముంబైలోని జీటీ ఆసుపత్రికి తరలించారు.