NTV Telugu Site icon

Salaar: సలార్ 2 ఇప్పట్లో లేనట్లేనా.. అసలేం జరిగింది..?

Untitled Design (79)

Untitled Design (79)

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే .ఈ చిత్రాన్ని రెండు భాగాలుగాతీసుకు వస్తాం అని మొదట్లోనే ప్రకటించాడు దర్శకుడు. అలాగే మొదట పార్ట్ చివరలో పార్ట్ -2 త్వరలోరానుందని టైటిల్ వేసాడు, కానీ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. మైత్రీ సంస్థ ఆగష్టు 9న పూజా కార్యక్రమం నిర్వహించబోతోంది.

Also Read: Tollywood : పవర్ ఫుల్ పోలీస్ గా యంగ్ హీరో.. దర్శకుడు ఎవరంటే..?

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం చేస్తున్న ‘దేవర’ అనే సినిమా రెండు భాగాలుగా చేస్తున్నారు. మొదటి భాగం త్వరలోనే షూట్ ముగియనుంది. సలార్ నిర్మాతలు సలార్ 2 ను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నంలో ఉన్నారు. కానీ ప్రభాస్ డేట్స్ ఇప్పట్లో దొరికేలా లేవు సలార్ నిర్మతలకు. డార్లింగ్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. సెప్టెంబరు నుండి హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించే చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు ప్రభాస్, ఆ వెంటనే కల్కి -2 ఉందనే వుంది. ఎటు చూసుకున్నా సలార్ – 2 కుఇప్పట్లో మోక్షం లేనట్టే. ఈ లోగా తారక్ ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది. సో ప్రశాంత్ నీల్ బిజీ. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. తారక్ తో రెండు పార్ట్స్ ఫినిష్ చేసాకే సలార్ -2 ఉంటుంది

Show comments