Sakkshi Mhadolkar About Sree Vishnu Comedy Timing: యంగ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో 2025లో విడుదలైన తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘మోగ్లీ’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఫ్యామిలీ ప్యాక్ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి మడోల్కర్ తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌ను అందుకోవడం చాలా కష్టమని చెప్పారు. ‘శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ వేరే లెవల్. ఆయన్ను మ్యాచ్ చేయడం చాలా కష్టమైంది. ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. కామెడీ సినిమా చేయడం నాకు ఇదే మొదటిసారి. టీమ్‌లో మిగతా వారంతా ఇప్పటికే కలిసి పనిచేశారు. నేను మాత్రం కొత్త మెంబర్‌ను. అయినప్పటికీ షూటింగ్ చాలా సరదాగా జరిగింది. అందరూ నాకు ఎంతో సహకరించారు. నా పాత్రకు న్యాయం చేయాలనే బాధ్యత, ఒత్తిడి ఉన్నప్పటికీ దర్శకుడు, నిర్మాతలు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు.
‘ఫ్యామిలీ ప్యాక్’ తన కెరీర్లో తొలి సంక్రాంతి విడుదల సినిమా కావడం చాలా సంతోషంగా ఉందని సాక్షి మడోల్కర్ చెప్పారు. తన మొదటి సినిమాలో డైలాగులు లేకపోవడంతో స్నేహితులు సరదాగా ఆటపట్టించేవారని గుర్తుచేసుకున్నారు. ‘ఏంటి.. నీకు డైలాగులే లేవా?’ అని అడిగేవారని చెప్పారు. అయితే ‘ఫ్యామిలీ ప్యాక్’లో తనకు డైలాగులు ఉన్నాయని, మాట్లాడటంతో పాటు డ్యాన్స్ కూడా చేస్తానని తెలిపారు. ఈ సినిమాలో పూర్తి వినోదాత్మకమైన పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నట్లు వెల్లడించారు. ఈ సంక్రాంతిని ‘ఫ్యామిలీ ప్యాక్’తో అందరం కలిసి గొప్ప వేడుకగా జరుపుకుందామని సాక్షి అభిమానులకు పిలుపునిచ్చారు. తొలి టీజర్‌తోనే ఆసక్తి పెంచిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.

