యంగ్ హీరో అహాన్ పాండే, అనిత్ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. ఈ విజయం పై కేవలం అభిమానులు మాత్రమే కాదు.. పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ వంటి దర్శకులతో పాటు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమా స్క్రీన్‌ప్లే, సంగీతం, కథపై ట్వీట్లు చేసి అభినందనలు తెలిపారు. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వచ్చిన ప్రేమకథలలో ‘సైయారా’ ప్రత్యేకమైనదని అన్నారు..
Also Read : Mirai : ‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..
ముఖ్యంగా ప్రేమను వివరిస్తూ చెప్పిన కొన్ని డైలాగ్స్ నేరుగా హృదయాన్ని తాకుతున్నాయి. అందుకే యూత్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్ యాక్టింగ్ కి అయితే ఫిదా అవుతున్నారు. ఇక కలెక్షన్‌ల పరంగా కూడా ఈ మూవీ ధూసుకుపోతుంది. తాజా సమాచారం ప్రకారం కేవలం ఐదు రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ మేరకు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా గతంలో విడుదలైన హిట్ ప్రేమకథా చిత్రం ‘ఆశికీ-2’ లైఫ్‌టైమ్ గ్రాస్‌ను కూడా అధిగమించినట్లు సమాచారం. ఇదే బజ్‌తో ముందుకు సాగితే, ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
