Site icon NTV Telugu

Sairam Shankar: ‘ఒక పథకం ప్రకారం’ అంటున్న పూరీ తమ్ముడు

గతంలో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. వినోద్‌ విజయన్‌ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌ బ్యానర్స్ పై సాయిరామ్‌ శంకర్, అశీమా నర్వాల్‌, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్‌ విజయన్‌ దర్శకత్వంలో ‘ఒక పథకం ప్రకారం’ సినిమా తెరకెక్కింది. వినోద్‌ విజయన్, గార్లపాటి రమేష్‌ నిర్మాతలకు వ్యవహరించిన ఈ సినిమాని మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Also Read; Record Break: పాన్ ఇండియా సినిమాగా రికార్డ్ బ్రేక్ – ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్

ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్‌ విజయన్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది, ఈ థ్రిల్లర్ సినిమాలో హీరో సాయి రామ్‌ శంకర్‌ విభిన్నమైన, పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారన్నారు. సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో అత్యద్భుతంగా నటించారనీ , గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందనీ అన్నారు. రాహుల్ రాజ్ అద్భుతమైన రెండు పాటలు అందించగా, సిధ్ శ్రీరాం ఆ పాటలకు ప్రాణం పోశారు. ఇప్పటికే టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదలై మొదటి పాట “ఒసారిలా రా” మంచి రెస్పాన్స్ అందుకుందన్నారు. డి.ఓ.పి రాజీవ్ రవి, ఆర్ట్ డైరెక్టర్: సంతోష్ రామన్, సౌండ్: ఎస్ రాధా కృష్ణన్, మేకప్: పట్టణం రషీద్, పట్టణం షా, ఇలా ఐదుగురు నేషనల్ అవార్డు విన్నర్స్ ఈ చిత్రానికి టెక్నిషియన్స్ గా పనిచేశారని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version