Site icon NTV Telugu

Sai Rajesh: ‘బేబి’మూవీ హిందీ రీమేక్‌పై.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్ !

Rajesh

Rajesh

‘బేబీ’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రాజేష్ ద‌ర్శక‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి చైత‌న్య హీరోహిరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రం యూత్‌కి మంచి మెసెజ్ ఇవ్వడంతో పాటు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్‌కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అందులో హీరోగా ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ నటించాలి. అయితే ఇటీవ‌ల బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే, సిద్ధార్థ్ చతుర్వేది తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని బాబిల్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ ఎంత రచ్చకి దారి తీసిందో తెలిసిందే..

Also Read : Habit Effects: పిల్లల్లో ఈ అలవాటు చాలా ప్రమాదకరం..!

దీంతో అనన్య, సిద్ధార్ధ్‌ల‌ని బాబిల్ అలా కామెంట్ చేయ‌డం సాయి రాజేష్ కూడా ఖండించారు. ఆ త‌ర్వాత ఇద్దరి మ‌ధ్య ఆన్‌లైన్ వేదిక‌గా చాలా డిస్కష‌న్ న‌డిచింది. దీంతో ‘సాయి రాజేష్ కోసం నా జీవితంలో రెండేళ్లు ఇచ్చాను, ఈ ప్రయాణంలో నాకు వచ్చిన అవకాశాలు వదులుకున్నా. సాయి రాజేష్ సర్‌కి, నాకు ఎంతో మంచి రిలేషన్ ఉంది.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను.. మళ్లీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను.. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను’ అని బాబిల్ ఖాన్ పోస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై రాజేష్ స్పందించారు.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవాన్ని అంగీకరించక తప్పదు, కొన్ని రోజుల పాటు అతనితో ప్రిపరేషన్ వర్క్ చేశాం. మా హీరోని మిస్ అవుతున్నాము. అలాగే సెల్ఫ్ కేర్ ముఖ్యం, బాబిల్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాము. నా జీవితంలో నేను కలిసిన నటుల్లో బాబిల్ ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి. త్వర‌లో అత‌నితో క‌లిసి మూవీ చేస్తా’ అని సాయి రాజేష్ పేర్కొన్నారు.

Exit mobile version