Site icon NTV Telugu

Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో గుర్తింపు!

Sai Pallavi Kalaimamani Award,

Sai Pallavi Kalaimamani Award,

హీరోయిన్స్‌లో ఒక్కోక్కరి లైఫ్ స్టైల్ ఓక్కోలా ఉంటుంది. అలా నటి సాయి పల్లవి కూడా అందరి హీరోయిన్స్‌లా కాకుండా బిన్నంగా ఉంటుంది. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉండే నటిగా ప్రసిద్ధి చెందింది. దీనివల్ల ఆమెకు టాలీవుడ్‌లో “లేడీ పవర్ స్టార్” అనే ప్రత్యేక ట్యాగ్ దక్కింది. 1992లో కేరళలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుండి డాన్స్‌పై ఆసక్తి చూపి ప్రావీణ్యం సంపాదించింది. దీని ఫలితంగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2015లో “కిరిక్ 1” సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది..

Also Read :Ravi Teja : రవితేజ బయోపిక్ ప్లాన్ చేసిన హీరో ఎవరో తెలుసా?

తన సహజ నటన, డ్యాన్స్, ఫిట్‌నెస్ మరియు భావాలను చక్కగా చూపే ప్రతిభతో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి. అందుకే ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి అవార్డు దక్కింది. శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ చేతులమీదుగా ఈ అవార్డును సాయిపల్లవి స్వీకరించారు. ఈ అవార్డు ఆమె కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుంది. ఈ గౌరవాన్ని 2021, 2022, 2023 సంవత్సరాలకుగాను మొత్తం 90 మంది కళాకారులు పొందారు. ఇందులో ఎస్‌.జె. సూర్య, విక్రమ్ ప్రభు వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అభిమానులు మరియు సినీ రంగంలోని వారు ఆమెకు అభినందనలు తెలిపారు, ఇది ఆమె ప్రతిభకు అందిన మరొక గుర్తింపు అని చెప్పవచ్చు.

Exit mobile version