Site icon NTV Telugu

వెలకట్టలేని సంతోషంలో సాయి పల్లవి… ఎందుకంటే?

Sai Palalvi Shares pics with her Grandparents

ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదుగా ఫోటోలను పోస్ట్ చేసే సాయి పల్లవి తన తాత, అమ్మమ్మ, సోదరితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. ‘ఫిదా’ బ్యూటీ తన తాత 85వ పుట్టినరోజు కోసం సంప్రదాయ చీర కట్టుకుని కన్పించి నిజంగానే అందరినీ ఫిదా చేసేసింది. ఈ వేడుకలో సాయి పల్లవి నీలిరంగు పట్టు చీర ధరించి చాలా సింపుల్ గా ఉండడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేడుకలకు సంబంధించి ఆమె తన అమ్మమ్మ, సోదరి చిత్రాలను కూడా పంచుకుంది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సాయి పల్లవిని చూస్తుంటే ఆమె వెలకట్టలేని సంతోషంలో ఉన్నట్టు కన్పిస్తోంది.

Read Also : కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన “ఇస్మార్ట్” బ్యూటీ

ఇక ఈ నేచురల్ బ్యూటీ సినిమాల విషయానికొస్తే… నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ”లో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తోంది. సాయి పల్లవి ఇటీవల నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న “శ్యామ్ సింగ రాయ్” షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆమె రానా దగ్గుబాటితో “విరాట పర్వం”లో కూడా కనిపించనుంది. లవ్ స్టోరీ, విరాట పర్వం వరుసగా ఏప్రిల్ 16, ఏప్రిల్ 30న కావాల్సి ఉండగా… కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఆ రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి.

View this post on Instagram

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

Exit mobile version