ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణంతో అయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఘట్టమనేని అభిమానులు మరొక చేదు వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సినీ నిర్మాత , సూపర్ స్టార్ కృష్ణ గారి బావమరిది అయిన ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు( 74 ) ఆదివారం సాయంత్రం అపోలో హాస్పిటల్ లో గుండెపోటుకు చికిత్స పొందుతూ మరణించారు.
ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు కృష్ణా జిల్లా , పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామంలో జన్మించారు. ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ రెండవ సోదరైన లక్ష్మీ తులసితో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 24 సినిమాలు నిర్మించారు. నిర్మాతగా సినీ పరిశ్రమకు సేవలందించిన ఆయన ఇక లేరు అనే మాట ఘట్టమనేని అభిమానులకు బాధ కలిగిస్తుంది. మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ, సంధ్యా, బజారు రౌడి వంటి హిట్ మూవీస్ నిర్మించారు.
ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు 1985 లో కృష్ణా జిల్లా గుడివాడ నియోజక వర్గం నుండి టీడీపీ అధినేత ఎన్.టి.ఆర్ పై పోటీచేసి ఓటమి చెందారు. తరువాత జరిగిన పరిణామాలలో 15 సం.ల క్రితం నారా చంద్రబాబు నాయుడు, వడ్డే శోభనాద్రీశ్వర రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి నుండి నేటి వరకు టీడీపీలో తన వంతు భాద్యతలు నిర్వర్తిస్తూ పార్టీకి ఎనలేని సేవలు చేసారు. ఇటీవల గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి శ్రీ పెమ్మసాని విజయం కోసం ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు కృషి చేసారు.
Also Read: Rao Ramesh : మారుతి నగర్ సుబ్రమణ్యం వచ్చేసాడు..ట్రైలర్ ఎలా ఉందంటే..?