NTV Telugu Site icon

Saara Saara: ‘సారా సారా’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు!

Saara Saara

Saara Saara

Saara Saara song from Average Student Nani Released: టాలీవుడ్‌లోనే కాదు అన్ని బాషల్లోను ట్రెండ్ మారింది. ఆడియెన్స్ కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇక అలా మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మారగా ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

మీ పిల్లలతో కల్కి సెట్స్ కి వెళ్లే ఛాన్స్.. ఎలాగంటే?

తాజాగా ఈ సినిమా నుంచి మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా సాగే ఓ మెలోడీ పాటను వదిలారు. సారా సారా అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తీక్ బి కొడకండ్ల ఇచ్చిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించగా సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించగా ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేశారు. ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Show comments