Site icon NTV Telugu

ఏక్ మినీ కథ : ‘సామిరంగా’ లిరికల్ వీడియో సాంగ్

Saamiranga Video Song With Lyrics from Ek Mini Katha

ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు బాణీలు సమకూరుస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘సామిరంగా పరేషాన్ ఈ జీవితం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. శ్రీరామ నవమి కానుకగా విడుదలైన ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ కు శ్రీజో లిరిక్స్ అందించగా.. పృథ్వి చంద్ర ఆలపించారు. మధ్యలో వచ్చే రాప్ ను శ్రీనివాస్ జోస్యుల పాడారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

https://www.youtube.com/watch?v=pCo0hew2qDA
Exit mobile version