NTV Telugu Site icon

RukminiVasanth : రానున్నది ‘రుక్మిణి వసంత’ కాలం

Rukminivasanth

Rukminivasanth

రుక్మిణి వసంత్ 2019లో వచ్చిన కన్నడ సినిమా బీర్బల్ ట్రైలాజీ కేస్ – 1సినిమాతో వెండితెరకు పరిచయమయింది. తోలి సినిమాతో ఓ మోస్తరుగా పేరుతెచ్చుకుంది. ఇక 2023లో వచ్చిన సప్తసాగరాలు దాటి సినిమాతో రుక్మిణి పేరు గట్టిగా వినిపించింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంటతో అమ్మడికి ఇతర భాషాల సినిమాలలో అవకాశాలు తలుపు తట్టాయి.

అలా తెలుగులో యంగ్ హీరో నిఖిల్ సరసన ‘అప్పుడో ఎప్పుడో ఇప్పుడే’ సినిమాలో హీరోయిన్ గా నటించే  అవకాశం పొందింది. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ ఎఫెక్ట్ ఈ భామ టాలీవుడ్ కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒకసారి రుక్మిణి వసంత్ డైరీ చుస్తే రానున్న స్టార్ హీరోల సినిమాలు అన్నిటిలోను ఈ భామనే కథానాయకి. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంతారా చాఫ్టర్ -1 లో రుక్మిణి వసంత్ నటిస్తోంది. అలాగే మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో రుక్మిణినే తారక్ సరసన జోడీగా ఎంపికైంది. త్వరలోనే ఇందుకు సంబందించిన ప్రకటన రానుంది. ఇక తమిళ్ లో చూసుకుంటే స్టార్ డైరెక్టర్ AR మురగదాస్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ నటించబోతున్న సినిమాకు రుక్మిణి వసంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే ఈ సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం.

Show comments