NTV Telugu Site icon

RRR BB Trailer: ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న ఇంత కష్టపడ్డాడా?

Rrr

Rrr

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు సాధించిందో, తెలుగు సినీ పరిశ్రమకు ఎంత మంచి పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.2022లో రిలీజైన ఈ సినిమాపై తాజాగా ఓ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో రాబోతున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ టీమ్ షూటింగ్ టైమ్‌లో తమ అనుభవాల్ని పంచుకున్నారు అవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్ మొదట్లోనే ఆర్ఆర్ఆర్ గురించి ఒక్క ముక్కలో రాజమౌళి చెప్పేయడం హాట్ టాపిక్ అవుతోంది. కెరీర్‌లో ఇప్పటివరకూ 12 సినిమాలు చేసినా ఎప్పుడూ భయపడలేదు కానీ ఆర్ఆర్ఆర్ కోసం భయపడ్డా.. అంటూ జక్కన్న పేర్కొన్నారు.

Health Benefits: ఈ పండు అమృతం.. చలికాలంలో తిన్నారంటే రోగాలు మటుమాయం

అసలు ఇలాంటి ఐడియాను ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలా అని ఆలోచించా? అసలు ఇద్దరు పెద్ద హీరోలని ఒకే సినిమాలో చూపించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అని రాజమౌళి పేర్కొనడం గమనార్హం. తారక్, చరణ్ అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చాలా ఎక్సైట్ అయ్యామని.. సెట్ కొచ్చిన ప్రతిసారి ఓ రకమైన ఇంట్రెస్ట్ కూడా ఉండేదంటూ చెప్పుకొచ్చారు. చరణ్ అయితే ఈ సినిమా కోసం నా బెస్ట్ ఫ్రెండ్ తారక్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూనే తారక్‌ని చూసి చాలా జెలస్ ఫీలయ్యా అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్ కూడా చరణ్ ఇంట్రడక్షన్ సీన్‌‌లో జంప్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. వారితో పాటు టెక్నీషియన్లు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, సెట్‌లో అల్లరిని ఇలా చాలా విషయాలు పంచుకున్నారు.