Site icon NTV Telugu

Roshan Vs Roshan: రోషన్ మేక వర్సెస్ రోషన్ కనకాల

Roshan Vs Roshan

Roshan Vs Roshan

ఒకే నేమ్‌తో ఉన్న ఇద్దరు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హీరోలుగా నిలదొక్కుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టారు. హీరోలుగా ఇంట్రడ్యూసయ్యారు. కానీ వారి ఫస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. నెక్ట్స్ తమ సెకండ్ ఫిల్మ్స్‌తో లక్ టెస్టుకు రెడీ అయ్యారు. వారే హీరో కుమారుడు శ్రీకాంత్ రోషన్, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల. వీరి తెరంగేట్రం ఈజీగానే జరిగిపోయింది కానీ హీరోలుగా సాలిడ్ ఐటెంటిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న వయస్సులోనే నిర్మలా కాన్వెంట్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేశారు ఇద్దరు రోషన్లు. ఆ తర్వాత ఎవరీ కెరీర్ వారిదే. ఎవరి ఆఫర్స్ వాళ్లవే. రోషన్ పెళ్లి సందDతో హీరోగా ఎంట్రీ ఇస్తే.. బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కానీ శ్రీలీల పాపులరై బాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమైంది. కానీ రోషన్ మాత్రం సెకండ్ ఫిల్మ్ లోడ్ చేయడానికి నాలుగేళ్లు పట్టింది.

Also Read :Tollywood : ఆ ఇమేజ్‌కు దూరంగా యంగ్‌ హీరోలు?

అలాగే రోషన్ కనకాల కూడా టూ ఇయర్స్ బ్యాక్ బబుల్ గమ్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇలా తమ ఫస్ట్ సినిమాలతో ఫెయిల్యూర్స్ చవిచూసిన రోషన్ అండ్ రోషన్ కనకాల.. సెకండ్ ఫిల్మ్‌తో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. వీరిలో ముందు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రోషన్ కనకాల. రోషన్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మోగ్లీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కలర్ ఫోటో ఫేం సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సాక్షి మడోల్కర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

Also Read :Pyyavula Keshav: ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే..

పెళ్లి సందడి ఫ్లాప్ తర్వాత రోషన్ నెక్ట్స్ ఫిల్మ్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్‌తో క్రిస్మస్‌కు లెక్కలు తేల్చుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ కోసమే వృషభ నుండి క్విట్ అయ్యాడు. ఈ సినిమాకు స్వప్నా సినిమాస్, ఆనంది ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాలీవుడ్ బ్యూటీ అనశ్వర రాజన్ సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటరౌతోంది. మోగ్లీ ట్రైలర్ అండ్ ఛాంపియన్ టీజర్ అండ్ సాంగ్స్ మూవీలపైఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఫస్ట్ ఫిల్మ్స్‌తో బోల్తా పడిన ఈ ఇద్దరు తమ సెకండ్ ఫిల్మ్స్‌తో హీరోలుగా రిజిస్టర్ అవుతారా..? డిసెంబర్ రోషన్ స్క్వేర్స్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో..? చూద్దాం.

Exit mobile version