Uyir OTT Release: రియల్ పోలీస్ రాసిన కథ.. ఓటీటీలోకి వస్తున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uyir OTT Release: మలయాళ చిత్రసీమ నుంచి వస్తున్న యదార్థ సంఘటనల క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. వాస్తవ సంఘటనలను ఉత్కంఠభరితమైన కథనంతో తెరపై చూపించే ఈ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే కోవలో మరో ఆసక్తికరమైన మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’. బాక్సాఫీస్‌లో తన ప్రయాణాన్ని ముగించుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ముఖ్యంగా ఈ సినిమాకు కథను ఒక రియల్ పోలీస్ అందించడం దీనిపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీ జూన్ 2026న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది.
జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్
దర్శకుడు ఎం. పద్మకుమార్ తెరకెక్కించిన ‘ఉయిర్’ చిత్రం ఆగస్టు 4 నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంట్లోనే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను చూసే అవకాశం లభించనుంది. ఈ సినిమా విజయంలో స్క్రీన్‌ప్లే కూడా కీలక పాత్ర పోషించింది. అలాగే గతంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఎల వీజ పూంచిర’ చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రియల్ పోలీస్ అధికారి షాజీ మారడ్ ఈ సినిమాకు కథను అందించారు. పోలీస్ శాఖలో పనిచేసిన అనుభవంతో ఈ మూవీలో విచారణ ఎలా సాగుతుందో అత్యంత సహజంగా చూపించే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో రోషన్ మాథ్యూ నటన సినిమాకు హైలెట్ గా నిలిచిందని ఇప్పటికే చూసినవారు ప్రశంసిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు బైజు సంతోష్ కూడా కీలక పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
- JSS Vardhan: 'ది ట్రెయిటర్స్'లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
సినిమా కథ
ఈ స్టోరీ కేరళలోని కోజికోడ్ జిల్లా కొడువల్లి ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఓ పాడుబడిన బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడుతుంది. అది హత్యా? లేక ఆత్మహత్యా? అనే అనుమానాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ కేసు బాధ్యతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రోషన్ మాథ్యూ చేపడతాడు. విచారణ ముందుకు సాగేకొద్దీ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతూ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు నిజం ఏమిటన్న ఉత్కంఠ చివరి వరకు సాగుతుంది. క్లైమాక్స్ లోనే అసలు విషయం బయటపడుతుంది. ఇంతకీ ఆమహిళను చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? రోషన్ మాథ్యూ ఈ కేసును ఎలా డీల్ చేశాడు ? అనే విషయాలను మాత్రం మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళ క్రైమ్ థ్రిల్లర్లను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యదార్థ సంఘటనలు, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు మంచి స్పందన లభిస్తోంది. ఆ కోణంలో చూస్తే ‘ఉయిర్’ కూడా థ్రిల్లర్ ప్రియులకు మంచి ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. ఒక రియల్ పోలీస్ అధికారి అనుభవంతో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా వీకెండ్ వాచ్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- Tags
- cinema
- Uyir OTT Release
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!