Site icon NTV Telugu

Kethika Sharma: ఆరెండూ రావాలంటే అదృష్టం ఉండాలి

Kethika

Kethika

Kethika: ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన అందమైన హీరోయిన్లలో కేతిక ఒకరు. పూరీ జగన్నాథ్ బ్యానర్ నుంచి హీరోయిన్ వస్తే.. పూరీ మెచ్చిన అందం తప్పదని అందరూ అనుకుంటున్నారు. ఊహించినట్లుగానే ఈ బ్యూటీఫుల్ ‘రొమాంటిక్’ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే కుర్రాడి మనసు ఉలిక్కిపడేలా చేసింది. తన అభిమానుల జాబితాలో చేరిపోయారు. గుమ్మడి పువ్వులా ఉన్న కేతికను చూడగానే కుర్రాళ్లు చలించిపోయారు. గ్లామర్ పరంగా .. నటన పరంగా కృతి శెట్టి , శ్రీలలతోపాటు తన జోరును చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. కథ అడ్డం తిరిగింది. గ్లామర్ పరంగా సినిమాలకు 100% మార్కులు వచ్చినా కథల పరంగా మాత్రం ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

దాంతో ఈ ముద్దుగుమ్మ కాస్త వెనుకబడింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అవకాశం రావాలి.. దాని వెనుక విజయం కూడా రావాలి అంటుంది. ఈ రెండూ రావాలంటే చాలు అదృష్టం ఉండాలి. తనకు దక్కని అదృష్టాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ఆమె ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన లేటెస్ట్ పిక్స్ రిలీజ్ చేస్తోంది. కేతిక అందాల గని అనడంలో సందేహం లేదు. లేకుంటే ఒక్క దెబ్బతో లక్ష్యాన్ని చేధిస్తే లైన్లో పడుతుందేమో చూడాలి మరి! అదృష్టం దక్కేనా కేతికా అంటూ కొందరు కామెంట్లు చేస్తారు. మరి కేతికకకు అదృష్టం వరిస్తుందో లేదో తెలియదు కానీ.. తన అందాలతో సోషల్‌ మీడియాను మాత్రం షేక్‌ చేస్తోంది ఈ అమ్మడు. మరి ఈపోజులకైనా ఏడైరెక్టరైనా కేతికపై దయ చూపేనా?

Exit mobile version