NTV Telugu Site icon

KCR: రాకింగ్ రాకేష్ కేసీఆర్ -‘కేశవ చంద్ర రమావత్’ రిలీజ్ ఆరోజే!

Kcr

Kcr

రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి ఈ సినిమాను స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కేశవ చంద్ర రమావత్’ మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.

Tollywood: చిన్న సినిమాలకి సెలబ్రిటీలు ఎందుకు సపోర్ట్ చేయాలి?

ఈనెల 22న సినిమా రిలీజ్ కానున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని ‘బలగం’తో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమెడియన్, దర్శకుడు వేణు లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టీంకి ఆల్ ద బెస్ట్. ఇది మరో బలగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు. ఈ సినిమాలో జోర్దార్ సుజాత, ధనరాజ్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, రవి రచ్చ, మై మధు, లోహిత్ కుమార్ ఇతర కీలక పాత్ర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తెలంగాణ మాస్ట్రో ‘చరణ్ అర్జున్’ మ్యూజిక్ అందిస్తున్నారు.

Show comments