Site icon NTV Telugu

Robinhood : అప్పుడే ఓటీటీలోకి ‘రాబిన్‌హుడ్’ మూవీ..

Nithin

Nithin

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ . వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, రోటీన్ కథ అవడం, డేవిడ్ వార్నర్ పాత్రను పూర్తిగా చూపించకపోవడం వంటి కారణాలతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రమెషన్లు జోరుగా చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Also Read: Sai Pallavi : అవార్డుల కన్న నాకు ప్రేక్షకులే ముఖ్యం..

వెన్నెల కిషోర్, చంద్ర ప్రసాద్, దేవ దత్త వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించి, రాజేంద్ర ప్రసాద్నాన్ స్టాప్ కామెడీ పండిచిన్నప్పటికి, ప్రేక్షకులను మాత్రం మెప్పించలేక పొయ్యారు. ఇప్పటికే డిజాస్టార్‌లు అందుకుంటున్న నితిన్, శ్రీలీల కెరీర్ లో మరో డిజాస్టర్ పడింది అని చెప్పాలి. అయితే తాజాగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లోకి రానుంది. జీ5 డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ఈ మూవీ మే 2న స్ట్రీమింగ్‌కి రానుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో బజ్. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే థియేటర్లలో విడుదలై నెలరోజుల్లోపే ఈ సినిమా ఓటీటీ వేదికపై అందుబాటులోకి రానుంది. ఇంత తక్కువ టైమ్‌లో ఓటీటీలోకి రాబోతున్న ఈ మూవీ, థియేటర్‌లో మిస్ అయినవారికి ఇప్పుడు ఇంట్లోనే చూసే ఛాన్స్ దక్కింది. మరి థియేటర్లలో ఫెయిలైన ఈ మూవీ ఓటీటీలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version