టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించడానికి ఒక క్రేజీ యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ సిద్ధమైంది. జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు, దర్శకుడు ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రిస్క్”. సందీప్ అశ్వ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పక్కా హిట్ టాక్ వినిపిస్తోంది.
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. ఈ చిత్రం నుంచి “దేవుడు వరమందిస్తే” అనే ఒక బ్యూటిఫుల్ మెలోడీయస్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన చేతుల మీదుగా ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. క్లాసిక్ టచ్‌తో సాగే ఈ మెలోడీ సాంగ్ వినగానే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఒక క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. “దేవుడు వరమందిస్తే” పాటకు సంబంధించిన హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa అనే ట్యాగ్‌లతో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో బెస్ట్ వీడియోలను ఎంపిక చేసి చిత్ర యూనిట్ ప్రత్యేకంగా నగదు బహుమతులు (Cash Prizes) అందజేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో నెటిజన్లు ఇప్పుడే ఈ సాంగ్‌పై రీల్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

