Site icon NTV Telugu

Rishab Shetty: 3 సినిమాలు.. 200 కోట్లు!

Rishab Shetty

Rishab Shetty

ప్రస్తుతం రిషబ్ శెట్టి ఒకపక్క హీరోగా నటిస్తూనే, మరోపక్క దర్శకుడిగా వ్యవహరిస్తూ ‘కాంతార చాప్టర్ 1’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే హీరోగా, ఆయనే దర్శకుడిగా రూపొందించిన ‘కాంతార’ సినిమా 2022లో విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీక్వెల్ — అంటే మనం గతంలో చూసిన కాంతార సినిమాకి ముందు ఏం జరిగింది అన్నది చూపించబోతున్న రెండో భాగం, అంటే ‘కాంతార చాప్టర్ 1’, త్వరలో విడుదల కాబోతోంది.

Also Read:Spirit: ‘స్పిరిట్’ ఇంకా ఆలస్యం?

ఇదంతా పూర్తయ్యాక, కాంతార సిరీస్‌లో మూడో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. ఇది మొదటి భాగానికి సీక్వెల్‌గా ఉండబోతోంది. అంటే మనం ఇప్పటికే చూసిన సినిమా తర్వాత ఏమి జరిగిందన్నదే ఈ మూడవ భాగంలో చూపించబోతున్నారు.

Also Read:Rishab Shetty: ప్రభాస్ హీరోగా రిషబ్ శెట్టి సినిమా?

హోంబలే ఫిలిం సంస్థ ఈ మూడు భాగాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నందుకుగాను రిషబ్ శెట్టి ఏకంగా రూ. 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో ఎంత నిజం ఉందన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా, అన్ని బాధ్యతలు భుజాన వేసుకుని ఆయనే చూసుకుంటున్నాడు కాబట్టి, ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం పెద్ద విషయమేమీ కాదనిపిస్తోంది. చూడాలి ఇందులో నిజం ఎంత ఉందో!

Exit mobile version