మరో ఆసక్తికర కాంబినేషన్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు హీరోగా, దర్శకుడిగా సినిమాలు చేస్తూ వచ్చిన రిషబ్ శెట్టి, వేరే హీరోని పెట్టి ఒక సినిమా దర్శకత్వం చేయబోతున్నాడు. అది కూడా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌లో. ప్రస్తుతానికి స్క్రిప్ట్ లాక్ అయింది కానీ, హీరోగా ఎవరిని ఎంచుకోవాలి అన్న విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి.
Also Read : Jagadish Reddy : ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి కౌంటర్
ప్రొడక్షన్ హౌస్ అయితే ఇప్పటికే ప్రభాస్తో పాటు, యష్, హృతిక్ రోషన్ ను ఆ పాత్ర కోసం పరిశీలిస్తోంది.వీరిలో ఎవరో ఒకరితో ప్రాజెక్ట్ ఫైనల్ చేయబోతోంది. అయితే ఇది ప్రచారమే గాక, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కూడా మైథాలజికల్ టచ్ ఉన్న సినిమా అన్నది తెలుస్తోంది. ప్రస్తుతానికి రిషబ్ శెట్టి చేస్తున్న సినిమాలన్నీ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. అవన్నీ పూర్తయ్యిన తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమా ప్రారంభించబోతున్నారు. అయితే హీరో ఫైనల్ అయితే, ఆయన డేట్స్‌ను బట్టి తన సినిమా ప్రారంభాన్ని ముందుకు లేదా వెనక్కి జరిపే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను వీలైనంత త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
