Site icon NTV Telugu

Rishab Shetty: నాగవంశీతో రిషబ్ శెట్టి సినిమా?

Rishabh

Rishabh

కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీక్వెల్ సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది.

Also Read:Coolie : అమీర్ ఖాన్ తో కాంబినేషన్ సీన్స్.. నాగ్ లీక్స్!

ఇక ఈ రోజు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆయన తాజాగా తెలుగు సినీ పరిశ్రమ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ రోజు రిషబ్ శెట్టికి కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఊరుకోకుండా, ఆయనతో కలిసి సినిమా చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది.

Also Read:Ramayana: రణబీర్ కి షాకింగ్ రెమ్యునరేషన్

ఒకవేళ రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సినిమా చేస్తే, మాత్రం ఖచ్చితంగా అది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అయితే, నిజానికి అలాంటి పాసిబిలిటీ ఏమైనా ఉందో లేదో తెలియదు, కానీ ఉందన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా, ఏ సంస్థతో చేసినా రిషబ్ శెట్టి ఒకవేళ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడితే, మాత్రం ఆయనను తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version