వంద సినిమాలు తీసిన, నటించిన కూడా రాని గుర్తింపు కొంత మందికి ఒక్క మూవీతోనే వచ్చేస్తుంది. అలా ‘కాంతారా’ తో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రూ.400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ ఒక్క సినిమాతో రిషబ్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. ఈ ‘కాంతారా’ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భూత కోలా అనే సంప్రదాయం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. కేవలం 18 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తే ఏకంగా రూ. 400 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు రిషబ్. ఇక మొదటి భాగం కు వచ్చిన స్పందన దృష్టిలో పెట్టుకుని ‘కాంతారా 2’ని రూ.200 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. ఇదిలా ఉంటే తాజాగా ఈ రిషబ్ కుటుంబానికి ప్రమాద హెచ్చరిక వచ్చింది..
అది కూడా ఏకంగా ఆ దేవుడు నుంచి.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజం. అసలు ఏం జరిగింది అంటే.. రీసెంట్‌గా మంగళూరులోని కద్రి బరేబైల్‌లో జరిగిన వార్షిక ఉత్సవానికి రిషబ్ శెట్టి హాజరై తన సమస్యను పంజుర్లీ దేవికి చెప్పుకున్నాడు. దీంతో ‘నీకు చాలా శత్రువులున్నారు. వాళ్ళు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. కానీ నీకు ఎలాంటి హాని జరగకుండా నేను చూసుకుంటా. వచ్చే 5 నెలల్లో మంచి చేస్తా’ అని ఆ దేవుడు రిషబ్ శెట్టి అభయం ఇచ్చాడట. అలా పంజుర్లీ వారాహి రిషబ్ ని హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.