బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా చేసిన రోటీపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. ఈ బ్యూటీ ఐరన్ పాన్ మీద రోటీ తయారు చేయడానికి ట్రై చేసింది. కానీ దానిని పూర్తిగా కాల్చేసి పాన్ మీదే మాడ్చేసింది కూడా. ఆ రోటీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రిచా. “ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను ఐరన్ తవా ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. కానీ దీన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు. ఎందుకంటే… ఇది నా రోటీ. దీని సౌండ్ మీరు వినవచ్చు. నేను వంటను ఎందుకు ద్వేషిస్తున్నానో మళ్ళీ నన్ను అడగవద్దు” అని వీడియోలో నటి తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందైతే ఏకంగా ఆ రోటీతో ట్రోలర్స్ తలలు పగలగొట్టొచ్చు అంటూ జోకులేస్తున్నారు. ఇక రిచా సినిమాల విషయానికొస్తే… ‘మేడం చీఫ్ మినిష్టర్, లండన్ కాన్ఫిడెన్షియల్ లో కనిపించారు. ప్రతీక్ గాంధీ సరసన ‘సిక్స్ సస్పెక్ట్స్’ అనే వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది. ఫక్రీ-3, క్యాండీ, అభి తోహ్ పార్టీ షురు హుయ్ హై చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తన ప్రియుడు అలీ ఫజల్‌తో కలిసి రిచా ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’కు కూడా నిర్మించనుంది.
A post shared by Richa Chadha (@therichachadha)