NTV Telugu Site icon

RGV: బిగ్గెస్ట్ ఎవర్ సినిమా “సిండికేట్” చేస్తున్నా

Rgv

Rgv

సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను ఆ సినిమా పేరు సిండికేట్ అంటూ పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే భయంకరమైన సంస్థ గురించి అని అంటూ రాసుకొచ్చాడు. 70వ దశకం వరకు విజృంభించిన స్ట్రీట్ గ్యాంగ్‌లు కరడుగట్టిన రాజకీయ పార్టీలలోకి ప్రవేశించాయి. తరువాత ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైన వాటికి విపరీతమైన డిమాండ్ కారణంగా స్మగ్లర్లు పెరిగినప్పుడు, వాటిని కూడా ఆర్థిక సంస్కరణలు నాశనం చేశాయి, ఆపై ఘోరమైన కార్పొరేట్ ముఠాలు మరోసారి విజయం సాధించడానికి D COMPANY మొదలైనవి వచ్చాయి.

Daggubati Purandeswari: అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా!

అంతర్జాతీయ నేర సంస్థగా ఈ సిండికేట్ ఉంటుంది.. సిండికేట్ చాలా భయంకరంగా ఉండబోతోంది.. మనుషులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకోగలరో చూపించనున్నాను.. నేర ప్రవృత్తిని ఇందులో చూపిస్తాను.. క్రైమ్, టెర్రర్ అనేది ఎప్పటికీ చావదు.. మరింత తీవ్ర స్థాయి రూపం దాల్చుకుంటుందని చూపించబోతోన్నాను.. ఈ ఒక్క మూవీతో ఇన్ని రోజులు నా మీద వచ్చిన అపవాదుని తొలగించుకుంటాను.. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాను అని వర్మ ట్వీట్ వేశాడు. సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నటీనటులు సహా ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించబడతాయి అని వర్మ చెప్పుకొచ్చాడు.