Site icon NTV Telugu

‘రకరకాల భార్యలు’ పేరిట ఆర్జీవీ వెబ్ సిరీస్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు. మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశమన్నారు. ఇదంతా సీజన్ వన్ అని, సీజన్ 2లో ‘రకరకాల భర్తల’ గురించి చెప్తామన్నారు. ఈ సిరీస్ లో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Exit mobile version