NTV Telugu Site icon

Demonte Colony 2: ఆ అపార్ట్మెంట్ అంటే భయపడేవారు.. “డిమాంటీ కాలనీ 2” ఈవెంట్ లో వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rgv Demonte Colony

Rgv Demonte Colony

RGV Intresting Comments at Demonte Colony 2 Pre Release Event: తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డిమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆగస్టు 15న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మంచి బజ్ తెచ్చుకుంది. నైజాంలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేస్తోండగా శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించగా అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

Samantha: ఆ ప్రశ్నకు షాకయిన సమంత.. దెబ్బకు ముఖకవళికలు మారిపోయాయ్!

ఈ క్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ నేను ఇరవై ఏళ్ల క్రితం భూత్ అనే సినిమా చేశా, అది అపార్ట్ మెంట్ లో జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్ మెంట్స్ లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. డిమాంటీ కాలనీ రిలీజ్ అయ్యాక ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ జరిగిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నాతో చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్ ఫిల్మ్. ఇప్పుడు మరో భాషలోకి వస్తోంది అంతే. ఈ మూవీ ప్రీమియర్ చూడలేదు కానీ తమిళ్ నుంచి ఇక్కడ ప్రీమియర్ చూసిన వాళ్ల దగ్గర నుంచి మంచి టాక్ వచ్చింది. ఇవాళ కంటెంట్ ఉన్న సినిమాల చూసే ట్రెండ్ నడుస్తోంది. అలా తెలుగులోనూ “డిమాంటీ కాలనీ 2” ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు. ఈ సినిమా డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ మూవీకి 3, 4 పార్ట్స్ కూడా చేయబోతున్నాం. సెకండ్ పార్ట్ లోని ఆర్టిస్టులంతా థర్డ్ పార్ట్ లో కంటిన్యూ అవుతారు. ఇప్పటిదాకా ఏ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచ్యువాలిటీ చూపించలేదు. మేము ఈ మూవీలో టిబెటియన్ యాక్టర్ ను పెట్టి ఆ ప్రయత్నం చేశామన్నారు.