Site icon NTV Telugu

Barqa Madan : గ్లామర్ ప్రపంచం వదిలేసి.. సన్యాసిగా మారిన RGV హీరోయిన్

Barqa Madan

Barqa Madan

జీవితంలో అన్ని ఉన్నప్పటికీ కొంత మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ప్రజంట్ ఇలాంటి పరిస్ధితిలోనే ఉంది ఓ స్టార్ హీరోయిన్. కెరీర్ లో వరుస సూపర్ హిట్స్.. ఎన్నో అవార్డులు.. రూ. కోట్లలో రెమ్యూనరేషన్.. కానీ అవేవీ ఆమెను సంతృప్తి పరచ పరచలేదు. అందుకే ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నీ వదిలేసి సన్యాసిగా మారింది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్ ? అనుకుంటున్నారా..

Also Read : Ananthika : ఇది నా జీవితానికి దగ్గరైన పాత్ర.. ‘8 వసంతాలు’ సక్సెస్ పై అనంతిక స్పందన

ఆమె పేరు బర్ఖా మదన్. ఒకప్పుడు మోడల్‌గా, ‘మిస్ ఇండియా’ ఫైనలిస్ట్‌గా వెలుగులోకి వచ్చిన బర్ఖా మదన్ బాలీవుడ్ లో 1996లో అక్షయ్ కుమార్, రేఖతో కలిసి ‘ఖిలాడియోం కా ఖిలాడి’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘భూత్’ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అతి తక్కువ సమయంలోనే దాదాపు 20 చిత్రాల్లో నటించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ కనువిందు చేసింది. కానీ బర్ఖా మదన్‌కి సినిమాలు, గ్లామర్ ప్రపంచం అంత తృప్తి ఇవ్వలేదు. అందుకే ఆత్మ సంతృప్తి కోసం ఆమె బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించింది. నిష్ఠతో ధ్యాన సాధన చేసేందుకు ఆమె సన్యాసాన్ని స్వీకరించింది. ఇప్పుడు ఆమె పేరు వెనరబుల్ గ్యాల్టెన్ సామ్టెన్. హిమాలయాల పర్వతాల్లో బౌద్ధ ఆశ్రమంలో జీవనం సాగిస్తూ ధ్యానం, ఉపన్యాసాలు, సేవా కార్యక్రమాలతో మునిగిపోయింది.

Exit mobile version