పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. అయితే ఈ సెల్ఫీ కంటే దానికింద ఆమె రాసిన క్యాప్షన్‌నే అభిమానులను కాస్త కలవరపరిచింది.
Also Read : The Paradise : ది ప్యారడైజ్‌కి డబుల్ ట్రీట్..
‘సర్జరీ తర్వాత నా క్యూటీస్‌తో డిన్నర్‌కి వెళ్లాను’ఈ వాక్యంతో రేణు దేశాయ్ తనకు ఇటీవల సర్జరీ జరిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో వెంటనే నెటిజన్లు.. ఏం సర్జరీ?, ఆమె ఆరోగ్యం బాగుందా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో, ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆమె ముంబైలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం వెలువడుతోంది. కాగా ఈ ఫొటోలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ స్మైలింగ్ మూడ్‌లో కనిపించడంతో, పరిస్థితి అంత తీవ్రమేమీ కాదేమోనన్న ఊహనూ నెలకొంది. ఇంకా రేణు దేశాయ్ పూర్తి వివరాలు బయట పెట్టినప్పటికీ, ఆమె స్వయంగా స్పందిస్తే ఆరోగ్యంపై స్పష్టత రావొచ్చని ఆశిస్తున్నారు. రేణు దేశాయ్ ప్రస్తుతం సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ఆద్య తో కలిసి డిన్నర్ కు వెళ్లడం చూస్తుంటే పరిస్థితి నియంత్రణలో ఉందని అర్ధమవుతుంది. ఆమె త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
