ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో భారత్, పాక్‌కు సంబంధించిన వార్ వీడియోలు, ఫొటోలతో కూడిన పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు కొందరు యుద్ధంపై ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ విషయం తాజాగా నటి రేణు దేశాయ్ స్పందించారు..
Also Read : Prabhas : ‘ది రాజా సాబ్’ నుండి లేటెస్ట్ అప్ డేట్..
‘ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది వ్యూస్ కోసం ఫన్నీ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజర్లకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనం భయంలేకుండా మన ఇళ్లల్లో నిద్రపోతున్నామంటే.. దానికి కారణం బార్డర్‌లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టే. దయచేసి వారి, వారి కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోండి. మన ప్రార్థనలే వారికి అండ. ఇలాంటి సున్నితమైన సమయంలో మనం ఐక్యంగా ఉండాలి. సబ్‌స్క్రైబర్లను పెంచుకోవాలనో, ఎక్కువగా వ్యూస్ రావాలనో వార్‌పై ఫన్నీ రీల్స్, వీడియోలు చేయడం కరెక్ట్ కాదు’ అని రేణు దేశాయ్ తన పోస్టులో రాసుకొచ్చారు.
