Site icon NTV Telugu

Renu Desai : రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం

Renu Desai

Renu Desai

తెలుగులో పలు సినిమాలు హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయంలోనే తన తొలి సినిమా హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన ఆమె పలు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే అనేక కారణాలతో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ వేరే వివాహం చేసుకున్నారు. వివాహానికి సిద్ధమైనా ఎందుకో వెనక్కి అయితే తగ్గారు.

Amaran: కోటి ఇవ్వాలి.. అమరన్ మేకర్స్ కి స్టూడెంట్ నోటీసులు!

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె ఈరోజు తన ఇంట తీవ్ర విషాదం జరిగిన విషయాన్ని షేర్ చేసింది. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ ఆమె చనిపోయిన విషయాన్ని వెల్లడించింది. అయితే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. అలాగే పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జాతరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా పరే పాహి మురారే.” మళ్లీ మళ్లీ ఒకటి పుడుతుంది, మరల మరల ఒకరు మరణిస్తారు, మరల మరల ఒకరు తల్లి కడుపులో నిద్రపోతారు, ఈ అపరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చేయండి, ఇది దాటలేనిది, నా ప్రభూ అంటూ ఆదిశంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు.

Exit mobile version