Site icon NTV Telugu

Regina Cassandra : రెండు నగరాల మధ్య జర్నీ.. రెజీనా కొత్త మూవీపై ఎమోషనల్ పోస్ట్

Rejina

Rejina

సౌత్ సినీ ఇండస్ట్రీలో తన స్టైలిష్ లుక్స్‌, వెరైటీ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా. చిన్న వయసులోనే తన కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో స్థిరపడి, ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో కూడా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. సైకలాజికల్ థ్రిల్లర్స్, హారర్, కామెడీ వంటి విభిన్న జానర్స్‌లో నటించిన రెజీనా, ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ఎంచుకోవడంలో ముందుంటుంది. ఇప్పుడు ఆమె కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా మారబోయే ప్రాజెక్ట్ ‘ది వైవ్స్‌’. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మిస్టరీ థ్రిల్లర్‌. ఈ సినిమాలో మౌనిరాయ్, సౌరభ్‌ సచ్‌దేవా, సోనాలి కులకర్ణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా..

Also Read : Janhvi Kapoor: తప్పుబట్టిన సింగర్.. ఇచ్చి పడేసిన జాన్వీ కపూర్

రెజీనా ఈ మూవీకి సంబంధించి మొదటి షెడ్యూల్‌ను ముంబైలో విజయవంతంగా పూర్తి చేసిన విషయం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆమె తన పోస్ట్‌లో ఇలా పేర్కొంది.. ‘‘ఈ చిత్రంలో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. మేము మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తిచేశాం. దర్శకుడు ఈ కథను ఎన్నో అద్భుతమైన పాత్రలతో తీర్చిదిద్దుతున్నారు. ఈలోగా నేను చెన్నైలో ‘మూకుతి అమ్మన్‌ 2’ షూటింగ్‌ కూడా కొనసాగిస్తున్నాను. రెండు నగరాల సినీ పరిశ్రమల మధ్య ప్రయాణిస్తూ నటించడం నాకు ఒక ప్రత్యేకమైన సవాలు. కానీ ఇది నన్ను స్ఫూర్తిగా, శక్తిమంతంగా చేస్తోంది’’ అని రెజీనా తెలిపింది. ఇక రెజీనా రెండు పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం ఆమె కెరీర్‌లో మరో ఉత్సాహభరిత దశను సూచిస్తోంది. అభిమానులు ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version