ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా మాది అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు. తన దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న సినిమా పేరు రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ దర్శకులు అజయ్ కుమార్ గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ, ట్రైలర్ ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ మాట్లాడుతూ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది చదలవాడ శ్రీనివాసరావు, ఇప్పుడు ఆయన నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అన్నిటికంటే ఒక డిఫరెంట్ సినిమా చేయాలి అని కోరుకుంటున్నానన్నారు.
Also Read; Kamal Haasan: ‘‘ రెండు రోజుల్లో శుభవార్త’’.. డీఎంకేతో పొత్తుపై కమల్ హాసన్..
ఇది ఇప్పుడున్న అన్ని జోనర్స్ కి భిన్నంగా తీసుకొస్తున్న సినిమా అని ఇద్దరు అనాధలు ప్రపంచవ్యాప్తంగా దేశానికి గర్వకారణంగా ఎలా మారారు అనేది కథ అని అన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన ఒక కొత్త పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేయడం జరిగిందన్న ఆయన సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆ కొత్త పాయింట్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు, అంత మంచి సినిమా అవుతుందన్నారు. ఈ సినిమాని ఎనిమిది భాషల్లో అతి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో 8 భాషలలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ మరియు ఒడియా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. కథ అంజిరెడ్డి శ్రీనివాస్ అందించిన ఈ సినిమాకి సంగీతం సాబు వర్గీస్ అందించారు.
