Site icon NTV Telugu

OTT : రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

Pani

Pani

మలయాళంలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నటులలో జోజు జార్జ్ ఒకరు. నయట్టు, ఇరట్ట వంటి సినిమాలలో జోజు నటనకు గుర్తింపుతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. జోజు తెలుగులోను నటించాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ చేస్తూ మెప్పించడం జోజు స్టైల్. ఒకవైపు సినిమాలు చేస్తూనే తొలిసారిగా ‘పని’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు జోజు.

Also Read : Ajith Kumar : సంక్రాంతికి వాయిదా పడిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళంలో 2024లో వచ్చిన సూపర్ హిట్ రివెంజ్ మూవీ పని. దర్శకుడిగా మొదటి సినిమాతో సినీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాడు జోజు జార్జ్. గత ఏడాది అక్టోబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన ‘పని’ మిక్డ్స్ రివ్యూస్ వచ్చిన బాక్స్ ఆఫీస్ సూపర్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 37.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. జనవరి 16 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లోసాగుతుంది. కథ పాతదే అయినా ట్రీట్ మెంట్ కొత్తగా ఉండడంతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ సూపర్ హిట్ సినిమాను ఈ వీకెండ్ లో ఓ సారి చూసేయండి.

Exit mobile version