Site icon NTV Telugu

Prabhas Salaar : భయంకరమైన ఒక లోయలో యాక్షన్ సీన్

Salaar Movie

Salaar Movie

Rebel Star Prabhas Salaar Movie Updates.

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న మరో పాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌’. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన అందాల భామ శృతి హాసన్‌ నటిస్తోంది. అయితే కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా కేజీఎఫ్‌ నిర్మాతలే నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా కూడా ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే సాహా, రాధేశ్యామ్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో.. డార్లింగ్‌ కూడా సలార్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్‌ అభిమానులు కూడా సలార్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తుండదని వేచిచూస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న షెడ్యూల్‌లో భయంకరమైన ఒక లోయలో యాక్షన్ సీన్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు మేకర్స్‌. ఇదే షెడ్యూల్లో ఒక భారీ ఛేజింగ్ సీన్ ను కూడా చిత్రీకరించనున్నట్టు, త్వరలోనే ప్రభాస్ పోర్షన్ ను ముగించనున్నట్టుగా సమాచారం. అయితే మోస్ట్‌ అవేయిటెడ్‌ మూవీల్లో ముందు వరుసలో ఉండే సలార్‌పై అందరి ఆశలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్‌ మాత్రమే రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అయితే ప్రభాస్‌ సలార్‌ షూటింగ్‌తో పాటు ఆదిపురుష్ సినిమా షూటింగ్‌కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆదిపురుష్‌ నుంచి కూడా ఎలాంటి అప్డేట్‌ లేకపోవడంతో అభిమానులు నిరీక్షిస్తున్నారు.

 

 

Exit mobile version