NTV Telugu Site icon

ChiruAnil: అసలైన వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్?

Chiranjeevi Anil Ravipudi

Chiranjeevi Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి రీజినల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడంతోనే ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు మించి ఉండేలా సినిమాని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లాక్ చేశారు. డైలాగు వెర్షన్ రాసేందుకు వైజాగ్ కూడా వెళ్ళింది అనిల్ అండ్ టీం. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఒకప్పటి శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాలో ఉండే వింటేజ్ చిరుని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథగా చెబుతున్నారు.

Chhaava: రిలీజ్ కు ముందు వివాదం.. అయినా భారీ క్రేజ్

నిజానికి రీఎంట్రీ దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ప్రతిసారి వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ సినిమా మాత్రం అసలైన వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ అని మాట్లాడుకునేలా ఉంటుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్న తీరు బాగా వర్కౌట్ అయిందని దానికి తోడు కథ కూడా సెట్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కూడా ఒక మూడు నాలుగు వందల కోట్ల బ్లాక్ బస్టర్ లోడ్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు మేకర్లు