NTV Telugu Site icon

RC16: రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా షూటింగ్ అప్ డేట్స్

Rc

Rc

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగాజనవరి 9న రిలీజ్ చేయనున్నారు. చరణ్ కు సంబంధించి దాదాపు షూట్ పూర్తి అయింది. త్వరలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలెట్టనున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ ను ముగించిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టిపెట్టారు. ఆల్రెడీ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమాను చాలా నెలల క్రితం ప్రకటించాడు.

Also Read : Ananya : క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన అనన్య నాగళ్ల

స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్టయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ మేకోవర్ చేంజ్ చేసేపనిలో ఉన్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి కీలకమైన అప్ డేట్ అందుతోంది. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా నవంబర్ నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్తుంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఫస్ట్ షెడ్యూల్ ను ముందుగా కర్ణాటక లోని మైసూరులో ప్లాన్ చేసారు. అక్కడ దాదాపు 15 రోజులు పాటు షూట్ చేయనున్నారని తెలుస్తోంది.  ఆ తర్వాత యూనిట్ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత భాగం చిత్రీకరించనునున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ ఫై మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.